ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా జరుపుకుంటుంది. కే జి ఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెత్తిస్తు న్న ఈ సినిమా తప్పకుండా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుంది అన్న నమ్మకాలను వ్యక్తపరుస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాలు వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు ప్రభాస్ అభిమానులు.

ఆయన హీరోగా నటించిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడడంతో ఈ సినిమాపై వారు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఆది పురుష్  ఏ విధంగా కూడా కమర్షియల్ సినిమా కాకపోవడంతో భారీ కమర్షియల్ అంశాలు కలిగిన చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ఈ చిత్రం సంచలన విజయం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమాలో మంచి మంచి ట్విస్ట్ లు ఉన్నాయని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

 అయితే ప్రభాస్ అభిమానులు ట్విస్ట్ ల సంగతి పక్కన పెట్టి హీరో ఎలివేషన్ బాగుండాలని కథ ఇంకా బాగుండాలని అప్పుడే ప్రభాస్ ను వెం టాడుతున్న ఫ్లాప్ సమస్య దూరమవుతుంది అని వాళ్ళు చెబుతున్నారు. ఏదేమైనా ప్రభాస్ విజయం అందుకోవాలని ఆయన అభిమానులు కంకణం కట్టుకున్నారు. తప్పకుండా ఈ సినిమా ద్వారా భారీ విజయం అందుకోవాలని భావిస్తున్నారు ఆయన అభిమానులు.  ఇకపోతే ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. అలా ఇన్ని భారీ ప్రాజెక్ట్ లతో సినిమా చేస్తున్న ప్రభాస్ త్వరలోనే ఓ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మరి అయన అభిమానులు కోరుకుంటున్న విజయం దక్కుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: