ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న హైవే చిత్రం ఆగస్టు 19వ తేదీన ఆహా లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి న అధికారిక ప్రకటన రాగా ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంతో తప్పకుండా హిట్ కొట్టవలసిన అవసరం ఎంతైనా ఏర్పడింది. ఆయన గత సినిమా పుష్పక విమానం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దానికి కారణం ఏదైనా కూడా ఆ సినిమాతో ఆయన ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయారు.  

దాంతో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో థ్రిల్లింగ్ అంశాలతో రూపొందింది. ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది చూడాలి. అంతకుముందు ఆయన చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం మంచి విజయాన్ని అందుకోగా ఆ తర్వాత చేస్తున్న ఈ చిత్రం విజయం అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఇక ఆయన చేతిలో ఇప్పుడు పలు సినిమాలు ఉన్నాయి. సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనేసినిమా చేస్తున్న ఈ హీరో ఆ తర్వాత సినిమాగా అయ న దీన్ని రిలీజ్ చే సే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి ప్రేమకథా సినిమా గా రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా ఆర్య స్థాయి లో ఉంటుందని చెప్పొ చ్చు. మరి ఇప్పటివరకు మోస్తరు హీరో గా ఉన్న ఆనంద్ దేవరకొండసినిమా తో ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటారో చూడాలి.  ఆ తర్వాత గం గం గణేశా అనే మరొక సినిమాను కూడా చేస్తున్నాడు. మరి ఈ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టి ఆయన ను అగ్ర హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: