దర్శకుడు మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించకపోవడం ఆయనపై ఎంతో ఒత్తిడిని తీసుకు వస్తుందని చె ప్పవచ్చు. అంతకుముందు మంచి ట్రాక్ రికార్డు కలిగిన మారుతి ఎందుకు ఇలాంటి సినిమా చేశాడు అన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. గోపీచంద్ అభిమానులు సైతం ఈ దర్శకుడు చేసిన సినిమా పట్ల ఎంతగానో కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ సినిమాలను ఎంటర్టైన్మెంట్ గా చేసి ప్రేక్షకులను అలరించే దర్శకుడైన మారుతి ఎందుకు పక్కా కమర్షియల్ సినిమాను సరిగ్గా చేయలేకపోయాడు అనే విమర్శ రోజు ఎక్కువవుతుంది.

ఈ నేపథ్యంలో ఆయన ప్రభాస్ తో కలిసి చేయవలసిన సినిమాపై దీని ఎఫెక్ట్ పడుతుందని చెప్పవచ్చు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సిని మా రూపొందించబడుతుందని మొన్నటిదాకా వార్తలు షికార్లు చేశాయి. అయితే ఇటీవల కాలంలో పక్కా కమర్షియల్ సినిమా యొక్క ఫలితాన్ని చూసిన తర్వాత ప్రభాస్ ఆయనతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియన్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ మారుతితో సినిమా చేయాలి అంటే పక్కా కమర్షియల్ సినిమా తప్పకుండా హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరించకపోవడం నిజంగా మారుతికి ప్రభాస్ కు మధ్య దూరం పెరిగిన చేసిం దని చెప్పవచ్చు. మరి ఇంతటి ప్రజలు ఉన్న నేపథ్యంలో మారుతీ తన తదుపరి సినిమా ను ఏ హీరోతో చేస్తాడో చూడాలి. గతంలో అయన తో సినిమా కోసం పెద్ద పెద్ద హీరోలే లైన్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనను ఫ్లాప్ పలకరించిన నేపథ్యంలో ఎవరు ఆయనకు అవకాశం ఇస్తారో మరీ. టైర్ 2 హీరోలలో ఎవరో ఒకరు ఆయనతో సినిమా చేయడానికి ముందుకు రావలసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: