టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక రకమైన భావన మొన్నటిదాకా ఉండేది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని చెప్పవచ్చు. హీరోల వారసుల అభిమానులు కొత్తగా వచ్చే హీరోలపై తెగ విమర్శలు చేస్తూ ఉంటారు. వారు ఎదగడం వారికి ఇష్టం లేనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా వారు ఈ విధంగా చేయడం కొత్తగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే హీరోలకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. అలాంటి వారిలో స్టార్ గా ఎదుగుతున్న వారికి వీరు ఎక్కువ సమస్యగా మారుతూ ఉంటారు.

 లేని దాన్ని సృష్టించి సదరు హీరోలపై చెడు అభిప్రాయం వచ్చేలా చేస్తూ ఉంటారు. వారు నటించే సినిమాలు విడుదల అయ్యే సమయంలో వారి గురించి నెగటివ్ ప్రచారాలు చేసి మరి వారిని బ్యాడ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారు సినిమాలలో హీరోలుగా నిలుదొక్కుకోలేక మధ్యలోనే తమ చర్యలను ముగించుకోవలసి వస్తుంది. అలాంటి ఎన్నో గుండెలను దాటుకుని హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండకు సైతం ఈ విధమైన ఇబ్బందులు తలెత్తడం జరుగుతూ ఉంటుంది.

మొదట్లో ఆయనపై చాలామంది అభిమానులు ప్రోస్ చేసేవారు కానీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైగర్ సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే ఈ సినిమా పట్ల ఎవరు అంతగా నెగిటివ్ ప్రచారం చేయడానికి పెద్దగా ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పవచ్చు. దానికి కారణం విజయ్ దేవరకొండ అగ్రెసివ్ ప్రమోషన్స్ కారణం ఆగస్టు 25వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతూ ఉండగా పూర్తి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. చార్మీ, కరణ్ జోహార్ లు ఈ సినిమా కు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. నార్త్ లో ధర్మ ప్రొడక్షన్స్ వేరే స్థాయి లో ప్రమోషన్ ఈవెంట్స్ ను చేస్తుంది. చకచకా నార్త్ లో ప్రమోషన్స్ కంప్లీట్ చేస్తున్న విజయ్ త్వరలోనే సౌత్ లో ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: