ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఉప్పెన మూవీ తో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించి మొదటి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. 

ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ మూవీ తో రెండవ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో హ్యాట్రిక్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కృతి శెట్టి , రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ది వారియర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి , నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోయిన్ గా నటించింది.

సినిమా ఆగస్ట్ 12 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం కృతి శెట్టి వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస ఆఫర్ లతో ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్న కృతి శెట్టి , ఎన్టీఆర్ 30 సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకున్నట్లు అనేక వార్తలు కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. తాజాగా ఈ విషయం పై స్పందించిన కృతి శెట్టి ఎన్టీఆర్ 30 వ మూవీ లో నేను నటించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: