టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినా శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శతమానంభవతి మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత చాలా మూవీ లలో హీరో గా నటించినప్పటికీ అదిరి పోయే విజయం మాత్రం శర్వానంద్ కి బాక్సా ఫీస్ దగ్గర దక్కడం లేదు.

ఆఖరుగా శర్వానంద్ 'మహా సముద్రం' మూవీ లో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శర్వానంద్ కి జోడిగా రీతు వర్మ నటిస్తోంది. శ్రీ కార్తిక్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో శ్రీ కార్తీక్ దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ మూవీ ని ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో అమల ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది.

ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ ఒక టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒకే ఒక జీవితం మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ సినిమా నుండి రేపు ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్ ను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి రేపు ఒకే ఒక జీవితం మూవీ యూనిట్ ఇలాంటి అనౌన్స్మెంట్ ను చేయబోతుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: