హీరో, విలన్ పేరు పొందాడు విజయ్ సేతుపతి. ఇక ఈ హీరో కోలీవుడ్,టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదని చెప్పవచ్చు. ఇక హీరో ఏంటి కూడా విలన్ గా చేయడానికి ఏ హీరో ఎక్కువగా సాహసించడం చెప్పవచ్చు కానీ విజయ్ సేతుపతి మాత్రం ఇలాంటి పాత్రలను చాలా ధైర్యంగా చేస్తూ ఉంటాడు. కదా పాత్రకి తనకి నచ్చితే చాలు ఆ పాత్రకు తగ్గట్టుగా అల్లుకొని పోతూ ఉంటాడు విజయ్ సేతుపతి. రీసెంట్ గా విక్రమ్ సినిమాలోని నటన అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ సినిమాలో వాకింగ్ స్టైల్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు.


ఇలాంటి హీరోలతో కలిసిన నటించడానికి స్టార్ హీరోయిన్స్ సైతం పోటీ పడుతూ ఉంటారు ఇక బాలీవుడ్ మేకర్స్ కూడా తమ సినిమాలలో ఏదైనా ఒక పాత్రను ఈ హీరోని తీసుకుంటే వారి సినిమాలకు సౌత్ లో కూడా మంచి క్రేజీ ఉంటుందనే స్థాయికి ఎదిగారు విజయ్ సేతుపతి. అలా తన సొంత సినిమా అయినా లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం అమీర్ ఖాన్ విజయ్ సేతుపతిని పిలిచారట ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం ఈయనను అడిగారట.. కానీ ఆ పాత్ర కోసం చైతన్య ని రంగంలోకి దింపారు.


ఇక ఈ సినిమా ఈ నెల 11న విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రమోషన్ లో చైతన్య కూడా చాలా బిజీగా ఉన్నారు. ముందుగా ఈ సినిమాలో విజయ్ సేతుపతిని అనుకోగా ఆ తర్వాత ఆయనతో ఎందుకు చేయలేదని చైతన్యాన్ని అడగగా.. ఈ సినిమాలో నుంచి విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకున్నాడో తనకు నిజంగానే తెలియదని.. ఏమైనా డేట్స్ అందుబాటు కాక ఈ సినిమాలో నటించలేదేమో అని తెలియజేశారు ముందుగా ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే కదని రాసుకున్నారు కానీ తను ఎంటర్ అయిన తర్వాత నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఆ సినిమాలోని కథలను మార్పులు చేశారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: