చియాన్ విక్రమ్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కెరీర్ ప్రారంభంలో విక్రమ్ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించాడు. కాక పోతే ఆ తర్వాత విక్రమ్ ఎక్కువగా తమిళ మూవీ లపై ఫోకస్ పెట్టి తమిళం లో ఎక్కువ సినిమాల్లో నటించాడు. తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విక్రమ్ , శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన అపరిచితుడు మూవీ తో ఇటు తమిళ్ లో అటు తెలుగు ఇండస్ట్రీ లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇలా తమిళ మరియు తెలుగు భాషల్లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విక్రమ్ తాజాగా కోబ్రా మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. 

మూవీ లో విక్రమ్ సరసన కే జీ ఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అజయ్‌ జ్ఞానముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్మూవీ ని నిర్మించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కోబ్రా మూవీ నుండి చిత్ర బృందం ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ ని ఆగస్ట్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మూవీ ని తమిళ , తెలుగు , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక కీలక పాత్రలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. మరి ఈ మూవీ తో విక్రమ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: