యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్ది రోజుల్లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో హీరో గా నటించ బోతున్న విషయం మనందరికీ తెలిసిందే . ఇది వరకే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలు వడింది . ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి .

అయితే ఆ తర్వాత ఆగస్ట్ నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి . ప్రస్తుతం మాత్రం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా  సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించడం కోసం బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లు , అందుకోసం జిమ్ లో కసరత్తు చేస్తుండగా భుజం నొప్పి బాగా వచ్చిందని దానితో ఎన్టీఆర్ బాధపడుతున్నాడు అని తాజాగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అని , జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడు అని, కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: