తెలుగులో బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలు కాబోతోంది. ఇప్పటివరకు బిగ్బాస్ 5 సీజన్లను కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఓటీటి లో స్ట్రీమింగ్ అయినా కూడా మంచి వ్యూస్ ను రాబట్టింది ఇక తాజాగా బిగ్ బాస్ 6 మరింత కొత్తగా ఆకట్టుకునే విధంగా తీసుకువచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ 6 కు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేసింది. షో టెలికాస్ట్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడలేదు. కానీ ఈ నెల చివరి వారంలో ఈ షో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.ఇక గత రెండు సీజన్లలో మాదిరిగానే ఈ సీజన్ కంటెస్టెంట్ లు కూడా పది రోజులు ముందుగానే వారం టైమ్ లో ఉండి ఆ తరువాత హోమ్ లోకి పంపించనున్నట్లు స్టార్ మా వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. ఇక బిగ్ బాస్ 6 కంటిస్టెంట్ గురించి కూడా పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక గతంలో మాదిరిగానే వీరు ఎంపికయ్యారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఈసారి లీకులకు చోటు ఇవ్వకుండా కంటెస్టెంట్స్ నుండి షో నిర్వాహకులు చాలా ప్యూహాత్మకంగా  అడ్డుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఉదయభాను విషయంలో మాత్రం కాస్త ఆసక్తి  రేపే విషయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే బిగ్ బాస్ 6 లో అత్యంత ఖరీదైన కంటెస్టెంట్ ఉదయభానుగా నిలవబోతోంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈమె నటిగా కూడా ఎన్నో సినిమాలలో నటించింది. తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ షో లో అడుగు పెట్టబోతోంది. అయితే గత కొన్నేళ్లుగా ఉదయభాను కావాలని తన అవకాశాలను తగ్గించుకుందో మరి ఇతర కారణాల చేత తెలియదు కానీ బుల్లితెరపై ఎక్కువగా కనిపించలేదు. కానీ ఈసారి బిగ్ బాస్ ద్వారా మళ్ళీ పాపులారిటీ సంపాదించుకొని బుల్లితెరపై కనిపించడం కన్ఫామ్ అన్నట్లుగా ఆమె అభిమానులు తెలియజేస్తున్నారు. ఇక బిగ్ బాస్ 6 లో ఈమె స్పెషల్ ఎంట్రీ హైలెట్గా ఉండబోతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: