మా టీవీ లో ప్రసారం కానున్న ...బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్6 తెలుగు ప్రోమో తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్6 త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. కాగా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బిగ్ బాస్ షో బుల్లితెరపై ప్రసారమయ్యే ఛాన్స్ అయితే ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే ఇక గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో కంటెస్టెంట్ల సంఖ్య తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సీజన్ లో కేవలం 12 లేదా 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే పాల్గొననున్నారని బోగట్టా.

అయితే బిగ్ బాస్ సీజన్ 6కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారని ఇప్పటికే విడుదలైన ప్రోమోతో కన్ఫామ్ అయింది.ఇకపోతే  ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ పూర్తైందని బోగట్టా.కాగా  ఎంపికైన కంటెస్టెంట్లను ఈ నెల 25వ తేదీ నుంచి క్వారంటైన్ లో ఉండనున్నారని సమాచారం అందుతోంది.  అయితే ఈ సీజన్ లో పేరున్న కంటెస్టెంట్లు పాల్గొననున్నారని తెలుస్తోంది. అంతేకాదు భారీ మొత్తంలో రెమ్యునరేషన్లను ఆఫర్ చేసి ఈ షో కోసం ప్రముఖ సెలబ్రిటీలను ఎంపిక చేశారని తెలుస్తోంది.

ఇదిలావుంటే ఇక మరోవైపు గతంలో బిగ్ బాస్ షో పలు వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.ఇక ప్రముఖ రాజకీయ నేతలు బిగ్ బాస్ షోపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా బిగ్ బాస్ షో వల్ల విడిపోయిన జంటలు సైతం ఉన్నాయి.ఇక  అందువల్ల బిగ్ బాస్ సీజన్6 ఎలా ఉండబోతుందో అని అభిమానుల మధ్య కూడా చర్చ జరుగుతోంది.అయితే  బిగ్ బాస్ సీజన్6 సక్సెస్ కావాలని బిగ్ బాస్ అభిమానులు కోరుకుంటున్నారు.ఇకపోతే ఈ షో ద్వారా నాగార్జునకు భారీ స్థాయిలోనే పారితోషికం దక్కుతోందని సమాచారం అందుతోంది.కాగా  బిగ్ బాస్ షో సీజన్6 ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే రికార్డు స్థాయిలో రేటింగ్ లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.అయితే  బిగ్ బాస్ షో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుండగా ఈ షో టైమింగ్స్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. పోతే యూత్ లో చాలామంది బిగ్ బాస్ షోకు అభిమానులుగా మారిపోయారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: