టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో శర్వానంద్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చిన ఈ హీరో అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. వరుస విజయాలతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ అందుకున్నాడు. అయితే గత కొన్ని సినిమాలుగా ఆయన పెద్దగా అలరించకపోవడం ఆయన క్రేజ్ తగ్గినట్లుగా తెలుస్తుంది. కారణం ఏదైనా కూడా ఆయన ఏ జోనర్ సినిమాలో నటించిన కూడా అది ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోతుంది.

దాంతో శర్వానంద్ తప్పకుండా ఈసారి చేయబోయే సినిమాతో మంచి కమ్ బ్యాక్ చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మంచి వినూత్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఒకే ఒక జీవితం సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు శర్వానంద్. ఇప్పటికే దీనికి సంబంధించిన విడుదలైన అప్డేట్లు ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి. అయితే మధ్యలో ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో అన్న అనుమానాలు అందరిలో రేకత్తాయి.

తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసింది. దానికి సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటించింది. అధికారికంగా ఈ విడుదల తేదీని ప్రకటించడంతో ఇప్పుడు ఈ సినిమా చూసేందుకు ఆయన అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించి శర్వానంద్ కు విజయాన్ని తెచ్చి పడుతుందో చూడాలి. ఇక అయన చేసిన గత సినిమా ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటించగా కథ పై పెద్ద పట్టు లేకపోవడంతో ఈ సినిమా ను ఫ్లాప్ గా నిర్ధారించారు ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: