రాజమౌళి సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. చాలా మంది ప్రేక్షకులు రాజమౌళి సినిమాలకు తరలి రావడం వెనుక కారణం హీరోలు కాదు ఆయనే అని ప్రతి ఒక్కరికి తెలుసు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి స్థాయి వేరే లెవెల్ లో మారిపోయింది. అందుకే ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రూపొందవలసి ఉండగా పలు కారణాలవల్ల అది ఏమాత్రం కుదరలేదు.

ఫైనల్ గా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పుడు రూపొందుతుంది. మహేష్ బాబు తో సినిమా అంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఇప్పటివరకు రాజమౌళి చేసిన హీరోలందరూ కూడా తాను స్టార్లు చేసిన హీరోలు కావడం వారితో రాజమౌళి ఎంతో కంఫర్టబుల్ గా పని చేయడం జరిగింది. మహేష్ బాబు లాంటి స్టార్ తో సినిమా చేయడం అంటే రాజమౌళి కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని చెప్పాలి. రాజమౌళి అంతకుముందు పనిచేసిన హీరోలందరూ కూడా ఆయన మాట వింటూ ఆయన నిర్ణయాన్ని ఫైనల్ గా చేసేవారు కానీ మహేష్ ఆ విధంగా వారిలాగా ఉంటాడా అనేదే ఇక్కడ అసలు విషయం. 

బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకపోయినా కూడా సీన్ చిత్రీకరించే విషయంలో మహేష్ బాబు ఏ విధంగా రాజమౌళి నిర్ణయాన్ని గౌరవిస్తాడో అనేది ఇక్కడ అసలు విషయం. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు పెడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు ఈ చిత్రం ను ఏ విధంగా చేస్తాడో అనేది చూడాలి. 2024వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది రాజమౌళి సినిమాను మొదలుపెట్టడానికి మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: