టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఉప్పెన మూవీ తో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన కృతి శెట్టి ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ని కొనసాగిస్తుంది .

కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ది వారియర్ మూవీ తో తమిళ ప్రేక్షకులను పలకరించిన కృతి శెట్టి కి ఈ మూవీ కాస్త నిరుత్సాహాన్నే మిగిల్చింది . ఇది ఇలా ఉంటే కృతి శెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొన సాగుతున్న సూర్య హీరో గా తెరకెక్క బోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కృతి శెట్టి తెలియ జేసింది . సూర్య సార్ తో నేను చేయబోయే సినిమా రెగ్యులర్ కమర్షియల్ మూవీ ల అస్సలు ఉండదు . 

మూవీ వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ ఆ మూవీ పై అదిరిపోయే రేంజ్ లో కామెంట్స్ చేసింది .  ఇది ఇలా ఉంటే కృతి శెట్టి తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ ఆగస్ట్ 12 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ మూవీ లో నితిన్ హీరోగా నటించగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మరి మాచర్ల నియోజకవర్గం మూవీ తో కృతి శెట్టి ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: