తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వారసుడు ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. మొదటి నుంచి యువ హీరోలకు భిన్నంగా ప్రత్యేకమైన సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా యువ సామ్రాట్ గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు నాగ చైతన్య. ఇక తన భార్య సమంత తో విడాకుల తర్వాత ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే బంగార్రాజు అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నాగచైతన్య. ఇక అంతకుముందు లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

 థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు  అయితే ప్రస్తుతం మొట్టమొదటిసారిగా నాగచైతన్య కెరీర్లో బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు నాగ చైతన్య. ఈ క్రమంలోనే ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అమీర్ ఖాన్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తోంది.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ లో తెగ బిజీగా ఉన్నాడు నాగ చైతన్య. ఇలాంటి సమయంలోనే ఇక లాల్ సింగ్ చద్దా సినిమా కోసం నాగచైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సాధారణంగా టాలీవుడ్ లో ఒక్కో సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు నాగచైతన్య.  కానీ బాలీవుడ్ సినిమాలో నటించినందుకు గాను కేవలం ఐదు కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇది టాలీవుడ్ లో తీసుకున్న పారితోషికం తో పోల్చి చూస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: