టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు  ఏర్పరుచుకున్న నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా , ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సముద్ర ఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , మహతి స్వర సాగర్మూవీ కి సంగీతాన్ని అందించాడు. రేపు అనగా ఆగస్ట్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం సభ్యులు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈ మూవీ లో హీరోగా నటించిన నితిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ లోని యాక్షన్ సన్నివేశాలు గురించి అద్భుతమైన వివరణ ఇచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో నితిన్ మాట్లాడుతూ ... ఇది వరకు నేను నటించిన సినిమాల్లో ఫైట్ సన్నివేశాలు ఉన్నాయి. కానీ మాచర్ల నియోజకవర్గం మూవీ లోని ఫైట్ లు మాత్రం చాలా స్పెషల్, అలాగే పవర్ఫుల్ స్టైలిష్ గా ఉంటాయి. ఈ మూవీ లోని ఒక్క ఫైట్ సన్నివేశం ఒక్కోలా ఉంటుంది. షూటింగ్ లో ఫైట్ అలవాటే కానీ మాచర్ల నియోజకవర్గం మూవీ లో ఫైట్ ల విషయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి ని తీసుకున్నాను. అలాగే షూటింగ్ లో కూడా కొన్ని గాయాలు అయ్యాయి ఇలా తాజా ఇంటర్వ్యూలో నితిన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: