టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అయిన నాగ చైతన్య కు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత తెలుగు లో ఎక్కువ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపుతోంది. అయితే ఒక వైపు హిందీ లో వరుసగా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి, తమిళంలో కూడా కమిట్ అయితే వరుసగా సినిమాలు వచ్చే అవకాశం ఉంది..అయితే అయినా కూడా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసే ఉద్దేశంతో సమంత ఉన్నట్లు గా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ఇక  తెలుగులో కథ నచ్చితే మంచి బ్యానర్ అయితే దర్శకుడు మంచి ప్రతిభావంతుడు అయితే పారితోషికం చాలా తక్కువ తీసుకొని కూడా సినిమా చేస్తానంటున్న సమంత ఇటీవల తన సన్నిహితుల వద్ద చెప్పు వచ్చిందంట.

ఇకపోతే తెలుగులోసమంత ఇంతగా సినిమాలు చేయడానికి కారణం ఏంటి అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.ఇక  ఈ సమయంలో చాలా మంది నాగ చైతన్యను టీజ్ చేయడం కోసం అని అంటున్నారు. కాగా అలాగే ఆయనను డామినేట్ చేయాలని ఉద్దేశంతోనే సమంత ఇలా చేస్తోందంటూ ఊహిస్తున్నారు. ఇక సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నాగచైతన్య ఏ ఒక్క నెగిటివ్ మాట కూడా సమంత గురించి మాట్లాడలేదు కానీ సందర్భం వచ్చిన ప్రతి సారి కూడా నాగచైతన్యను తక్కువ చేస్తూ సమంత మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే ఇక తెలుగులో ఆమె వరుసగా సినిమాలు చేయడం వెనుక కూడా ఉద్దేశం నాగచైతన్యను అవమానించడమే అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా  నాగ చైతన్య ఇటీవల సమంత గురించి చాలా సానుకూలంగా మాట్లాడాడు.అయితే  ఆమె మాత్రం మా ఇద్దరిని ఒక రూమ్‌ లో ఉంచితే పదునైన వస్తువులు అక్కడ ఉంచడం ప్రమాదం అన్నట్లుగా మాట్లాడింది. అంతేకాదు  అలాగే కరణ్‌ షో లో చైతన్య ను భర్తగా పేర్కొనగా వెంటనే మాజీ భర్త అనాలంటూ కరణ్ కు సూచింది.ఇక. అందుకే ఇప్పుడు నాగ చైతన్య అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: