దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాలిని ఠాగూర్ హీరోయిన్ గా ప్రేమ కథల స్పెషలిస్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ , మృణాళిని ఠాకూర్ నటనకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  అలా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు కలిగి ఉండడం వల్ల ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ మూవీ 17 కోట్ల బ్రేక్ ఈవెన్ ఫార్ములాతో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.

మూవీ కి మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ రావడంతో ఈ సినిమా 6 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 18.03 కోట్ల షేర్ , 35.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1.03 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: