దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర కని ఇతర ముఖ్య పాత్రల్లో ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో , ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే . థియేటర్ లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా గత కొంత కాలం నుండే 'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ కూడా అవుతుంది . 

మూవీ కి 'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్ ల్స్లో కూడా అదిరి పోయే రెస్పాన్స్ లభించింది . ఇలా థియేటర్ మరియు 'ఓ టి టి' ప్రేక్షకులను అద్భుతం గా అలరించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మరి కొద్ది రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతోంది . ఆగస్ట్ 14 వ తేదీన ఈ మూవీ తెలుగు , మలయాళ , హిందీ ప్రేక్షకులను అలరించబోతోంది . ఆర్ ఆర్ ఆర్ మూవీ తెలుగు వర్షన్ స్టార్ మాటీవీ లో ప్రసారం కానుంది . మలయాళం వర్షన్ ఆసియా నేట్  ఛానల్ లో ప్రసారం కానుంది. హిందీ వర్షన్ జీ సినిమా ఛానల్ లో ప్రసారం కానుంది. థియేటర్ మరియు 'ఓ టి టి' లలో  ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ బుల్లి తెరపై ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr