లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సీతారామం సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల జోడీ సినిమా కు హైలెట్ గా నిలిచింది. సినిమా చూసిన ఆడియెన్స్ అంతా కూడా సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ ని ఇష్టపడుతున్నారు. ప్రేమకథకు కావాల్సిన ఫ్రెష్ నెస్ ఆమె ఫేస్ లో కనిపించింది. అంతేకాదు ఆమె నుంచి డైరక్టర్ హను రాఘవపుడి మంచి నటనని రాబట్టుకున్నాడు.

అయితే రీసెంట్ గా సీతారామం సినిమాలో సీత పాత్రకి పూజా హెగ్దేని ముందు అడిగారని ఆమె కొవిడ్ బారిన బడటం ఆ తర్వాత డేట్స్ కుదరక పూజా హెగ్దే ఈ ఛాన్స్ మిస్ అయిందని అన్నారు. అయితే సీతారామం సినిమా పూజా హెగ్దే చేస్తే సినిమా మీద ఇంత ఇంప్యాక్ట్ వచ్చేది కాదని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పూజా హెగ్దేని బికినితో చూసిన ఆడియెన్స్ కి సీత పాత్రలో ఆమెని ఊహించుకోవడం కష్టమే. మృణాల్ ఠాకూర్ కి అంతకుముందు ఎలాంటి ఇమేజ్ లేదు కాబట్టి ఆమె ఫ్రెష్ నెస్.. క్యూట్ నెస్ సినిమాకు ప్లస్ అయ్యింది.

అందుకే సీతారామం సినిమా చూసిన ప్రతి ఒక్కరు సీత పాత్ర గురించి చెప్పుకుంటున్నారు. లేటెస్ట్ గా సినిమా సక్సెస్ మీట్ లో దుల్కర్ సల్మాన్ కూడా సీత పాత్ర గురించే అందరు మాట్లాడుతున్నారు. తనకు అసూయగా ఉందని అన్నారు. మొత్తానికి సీఎతగా మృణాల్ పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది. అంతేకాదు తర్వాత హిస్టారికల్, పీరియాడికల్ మూవీస్ తీసే వారికి మృణాల్ ని తప్పకుండా తీసుకునే ఛాన్స్ ఉంది. సీతారామం తో ఆమె తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది.  అంతేకాదు రెండు మూడు స్టార్ సినిమాల ఆఫర్లు కూడా వచ్చినట్టు లేటెస్ట్ టాక్. మొత్తానికి మృణాల్ ఠాకూర్ దర్శ తిరిగేలా చేసింది సీతారామం.


మరింత సమాచారం తెలుసుకోండి: