దాదాపుగా రెండు నెలల తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు ఆగస్టులో విడుదలైన బింబి సార, సీతారామం సినిమాలు మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ రెండు సినిమాల విజయం పై తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.బింబిసార, సీతారామం చిత్రాలు రెండు మంచి విజయాన్ని అందుకున్నాయి కదా అని సంబరపడిపోకూడదని తెలియజేశారు. భవిష్యత్తులో తెరకెక్కించే ప్రతి సినిమా కూడా మంచి కంటెంట్తో రూపొందించాలని ఆయన తెలియజేశారు మూడు నాలుగు రోజులు బస్సులను చూసి చాలా సంబరపడిపోకూడదని మేకర్స్ కు సలహాలు ఇచ్చారు.


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ పీరియాడికల్ చిత్రం ఎన్టీఆర్ బ్యానర్ పై నిర్మించారు ఈ సినిమాకి డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకుడుగా పరిచయమయ్యారు ఈ చిత్రం ఆగస్టు-5 న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాని చూసిన తమ్మారెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..బింబి సార చిత్రం రెగ్యులర్ కమర్షియల్ కదేనని కానీ అందులో కొత్తేమీ లేదని అయితే దర్శకుడు కాదని అర్థవంతంగా తీర్చిదిద్దిన తీరు అందరిని బాగా ఆకట్టుకుంది ప్రశంసలు వర్షం కురిపించింది అని తెలిపారు.

ఇక ఈ సినిమా టైమ్ ట్రావెల్ కథ కాబట్టి ఆదిత్య 369 తో పోల్చడం సరికాదని తెలిపారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారనేదానికి ఈ రెండు చిత్రాలు ఉదాహరణ అని తెలిపారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగాలి అని తెలిపారు. కనీసం 50 రోజులపాటు సినిమాలు థియేటర్లలో ఎందుకు వాడడం లేదని ప్రేక్షకులు ఎందుకు రావడం లేదని విషయం పైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని తెలిపారు అలా ఆలోచించినప్పుడే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని తమ్మారెడ్డి తెలిపారు. ఆ తరువాతనే సినీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వస్తుంది అని తెలిపారు మేజర్, విక్రమ్ సినిమాల తర్వాత థియేటర్లలో సక్సెస్ అనే మాట దాదాపుగా వినిపించక చాలా కాలమైంది ఇప్పుడు ఈ సినిమాలతోనే మంచి విజయాలు అందుకున్నాదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: