‘మహానటి’ తో తన స్థాయిని పెంచుకున్న దుల్కర్ లేటెస్ట్ గా విడుదలైన ‘సీతా రామం’ మూవీ సక్సస్ తో తెలుగు ప్రేక్షకులలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సాధారణంగా టాప్ హీరోలు తమ కొడుకులను హీరోలుగా చూడాలని చిన్నతనం నుండి వారికి నటన డాన్స్ ఫైట్స్ విషయంలో శిక్షణ ఇప్పిస్తూ తమ వారసుడు తయారవుతున్నాడు అని ఆనందాన్ని పొందుతారు.


అయితే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా దుల్కర్ జీవితం కొనసాగింది. దుల్కర్ ఎప్పుడు నటన పై ఆశక్తిని చూపే వాడు కాడట. కనీసం తన తండ్రి సినిమాలోని పాటలకు కూడ ఎప్పుడు దుల్కర్ తన ఇంటిలో ఒక్క స్టెప్ కూడ వేయలేదట. కాలేజీ ఫంక్షన్స్ లో కల్చరర్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనమని మమ్ముట్టి ఎన్నిసార్లు చెప్పినా తనకు స్టేజ్ ఎక్కడం అంటే భయం అంటూ కనీసం కాలేజీ ఫంక్షన్స్ కు కూడ వెళ్ళేవాడు కాడట.


దీనితో తన కొడుకు సినిమాలకు పనికిరాడనీ నిశ్చయించుకున్న మమ్ముట్టి దుల్కర్ కు కాలేజీ చదువు పూర్తి అయిన తరువాత అమెరికా పంపించి అక్కడ ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఎం.బిఎ చేయించి దుబాయ్ లోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త దగ్గరకు ట్రైనింగ్ కు పంపాడట. అయితే తాను 9 – 5 ఉద్యోగం తాను చేయడం తనకు ఇష్టం లేదని చెప్పి దుల్కర్ తిరిగి ఇంటికి వచ్చేసాడట. కొన్నిరోజులు గడిచిన తరువాత మమ్ముట్టి దుల్కర్ ను పిలిచి ఇలా ఎన్నిరోజులు ఖాళీగా ఉంటావు అని అడిగేసరికీ తాను సినిమా హీరో అవుతాను అని అనేసరికీ మమ్ముట్టికి విపరీతంగా అసహనం కలిగి ‘నువ్వు హీరోగా పనికిరావు’ చాల ఆవేశంగా చెప్పాడట.


అయితే దుల్కర్ తల్లి పట్టుపట్టి కొడుకును హీరోగా చేయడానికి మమ్ముట్టిని ఒప్పించడానికి ప్రయత్నిస్తే తన పరువు తీయడానికి ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అంటూ చాల అసహనానికి లోనయ్యేవాడట. అలాంటి దుల్కర్ హీరోగా మారి ‘ఉస్తాద్ హోటల్’ మూవీ నుండి వరస హిట్స్ అందుకుంటూ తన తండ్రి మమ్ముట్టి తో సమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం చూసినవారికి అదృష్టం ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో అర్థం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: