పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే రీసెంట్గా విడుదలైన రాధే శ్యామ్ , సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ప్రబాస అభిమానుల సైతం కాస్త నిరాశ చెందారని చెప్పవచ్చు. ఇక దీంతో తన తదుపరిచిత్రం పైన మరింత ఆశని పెట్టుకున్నారు అభిమానులు ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి మూడు ప్రాజెక్టులలో నటిస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా ఆది పురుష్, సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని గ్రాఫిక్స్ పనుల్లో చాలా బిజీగా ఉన్నది ఈ మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు.


తెలుగులో పాటు హిందీలో కూడా ఈ సినిమా మలయాళం తమిళ కన్నడ వంటి భాషలలో కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాతోపాటు కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్  సినిమా చేస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ కూడా తాజాగా వాయిదా వేయడం జరిగింది అందుకారణ ప్రభాస్ మోకాలికి చరిత్ర చికిత్స చేయడమే కారణం అన్నట్లుగా సమాచారం. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మహానటి ఫిలిం డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్టు-K సినిమా చేస్తున్నారు.

ఈ చిత్రం కూడా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్  తో తెరకెక్కించడం జరుగుతుంది దాదాపుగా రూ.500 కోట్ల రూపాయలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో దీపికా పడుకొనే, దిశాపటాని హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. ఇక ఇందులో బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ చేస్తూ ఉన్నట్లుగా సమాచారం. తాజాగా ఒక మీడియాతో అశ్వనీదత్ ప్రాజెక్టుకి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ తో ప్రాజెక్టు కె సినిమా షూటింగ్ 55 శాతం మాత్రమే కంప్లీట్ అయిందని తెలిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ బంద్ కారణం చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు అశ్వనిదత్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: