టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన కళ్యాణ్ రామ్ తాజాగా మల్లాడి వసిష్ఠ దర్శకత్వం లో తెరకెక్కిన బింబిసార మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సంయుక్త మీనన్ , క్యాథరీన్  హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నుండే అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి.  ఇప్పటి వరకు ఈ మూవీ వారం రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 8.04 కోట్లు , సీడెడ్ : 4.99 కోట్లు , యూ ఏ : 3.27 కోట్లు , ఈస్ట్ : 1.43 కోట్లు , వెస్ట్ : 1.05 కోట్లు , గుంటూర్ : 1.66 కోట్లు , కృష్ణ : 1.20 కోట్లు , నెల్లూర్ : 68 లక్షలు .


వారం రోజుల్లో బింబిసార మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.32 కోట్ల షేర్ , 35.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.45 కోట్లు . ఓవర్ సీస్ లో :  1.80 కోట్లు . వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ 25.57 కోట్ల షేర్ , 42.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ 'బింబిసార'  మూవీ లో తన నటన తో ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: