అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృతి హాసన్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత శృతి హాసన్ దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శృతి హాసన్ తెలుగు లో వరుస మూవీ లలో హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లతో పాటు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఒక  మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇలా వరుస మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న శృతి హాసన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పు డప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా శృతి హాసన్ తన కు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శృతి హాసన్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శృతి హసన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: