టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ చాలా రోజుల క్రితం అర్జున్ సురవరం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అర్జున్ సురవరం లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చందు మొండేటి ఈ దర్శకత్వం వహించాడు. కార్తికేయ 2 మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. కార్తికేయ మూవీ లో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించగా , చందు మొండేటి  దర్శకత్వం వహించాడు.

కార్తికేయ సినిమా మంచి విజయం సాధించడంతో కార్తికేయ 2 మూవీ పై నిఖిల్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న కార్తికేయ 2 మూవీ ఈ రోజు అనగా ఆగస్ట్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం వల్ల ఈ మూవీ కి మూవీ యూనిట్ భారీ సంఖ్యలో థియేటర్ లను కూడా ఏర్పాటు చేసింది. కార్తికేయ 2 మూవీ ఎన్ని థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది తెలుసుకుందాం.

నైజాం : 110 , సీడెడ్ : 50 , ఆంధ్ర : 180 . మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కార్తికేయ 2 మూవీ 340 థియేటర్ లలో విడుదల కాబోతుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 60 , ఓవర్ సీస్ లో : 200 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 600 థియేటర్ లలో విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: