ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకులలో లోకేష్ కనకరాజు ఒకరు. ఈ దర్శకుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా నగరం మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ని  మొదలు పెట్టాడు. ఆ తర్వాత కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఆ తర్వాత తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ మూవీ తో మరో విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా లోకేష్ కనకరాజు 'విక్రమ్' అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కమల్ హాసన్ హీరోగా నటించగా , విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటించగా , ఈ మూవీ లో గెస్ట్ రోల్ లో సూర్య నటించాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. కొంత కాలం క్రితం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా లోకేష్ కనకరాజు , రజనీ కాంత్ తో మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా లోకేష్ కనకరాజు రజనీ కాంత్ తో మూవీ గురించి మాట్లాడుతూ ... రజనీ కాంత్ తో మూవీ చేయడం మామూలు విషయం కాదు అని , రజినీ కాంత్ మార్కెట్, స్టార్డం ని మ్యాచ్ చేస్తూ చేయడం చాలా కష్టం అని ,  నేను రజనీ కాంత్ తో వర్క్ చేయాలని ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఆల్రెడీ ఒక ఐడియా కూడా ఉందని నా కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందని అనుకుంటున్నానని లోకేష్ కనకరాజు తాజాగా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: