సినిమా ఇండస్ట్రీలో అయిన సరే హీరో హీరోయిన్ లు కొంచం చనువుగా ఉన్న సరే వారి మధ్య ఏదో ఉంది అని అనుకుంటారు..అంతేకాదు డేటింగ్ కూడా చేస్తున్నారు అని.. లవ్ లో వున్నారు అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతాయి. అయితే ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి అంటే అందులో కనీసం 50% నిజం ఉందని చెప్పవచ్చు. పోతే  ఇటువంటి వార్తలపై కొంతమంది నటీనటులు చూసి చూడనట్టుగా వారి పని వారు చేసుకుంటూ వెళ్తే.. మరి కొందరు మాత్రం రూమర్స్ స్ప్రెడ్ చేసే వారిపై తమదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటారు.

 అయితే ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కూడా తనపై వినిపిస్తున్న రూమర్లపై స్పందించడం జరిగింది.ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటాని కొన్ని రోజుల క్రితం ప్రేమించుకుని తర్వాత బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.అయితే  ఇక వీరిద్దరూ విడిపోయిన తర్వాత సినీ ఇండస్ట్రీలో మరిన్ని వార్తలు వైరల్ అయ్యాయి. కాగా టైగర్ ష్రాఫ్.. దిశా పటాని తో బ్రేకప్ చెప్పిన తర్వాత మరొకరికి దగ్గరయ్యాడని కూడా బాలీవుడ్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.పోతే  ఇక ఆమె ఎవరో కాదు కేసనోవా మ్యూజిక్ వీడియోలో టైగర్ ష్రాఫ్ తో కలిసి చేసిన ఆకాంక్ష శర్మ.  

వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ప్రేమించుకుంటున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే  ఇక ఈ వార్తలపై ఇటు దిశ పటాని కానీ అటు టైగర్స్ ష్రాఫ్, ఆకాంక్ష శర్మ ఎవరూ కూడా స్పందించకపోవడం గమనార్హం.అంతేకాదు రోజురోజుకు వినిపిస్తున్న ఊహాగానాలు నిజమే అని పలువురు నెటిజన్స్ కూడా నమ్మే పరిస్థితి వచ్చింది. అయితే  ఇక ఈ విషయాలపై టైగర్స్ ష్రాఫ్ స్పందించారు. ఆకాంక్ష శర్మతో డేటింగ్ లో లేనని స్పష్టం చేసిన ఈయన దిశాపటానితో బ్రేకప్ చెప్పిన విషయంపై స్పందించలేదు.ఇకపోతే ఈయన సినిమాల విషయానికి వస్తే బడే మియా చోటే మియా , రాంబో , గణపతి పార్ట్ వన్, ఢీలా వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: