ఇటీవల ప్రముఖ సినీ నటులు ఆది పినిశెట్టి, నిక్కీ గాల్రాని దంపతులైన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మే లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ ప్రేమ జంట ఇప్పటికే తమ వెడ్డింగ్ స్టిల్స్ ను అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు సంతోషాన్ని కలుగ చేస్తుండగా..అటు మరొకవైపు తమ వెడ్డింగ్ వీడియో టీజర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇక మా పెళ్లి అయి మూడు నెలలు అవుతుంది.ఇకపోతే  కానీ నిన్ననే ఇదంతా జరిగినట్టుంది. అంతేకాదు మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది.. దానికి సంబంధించిన మరిన్ని వీడియోలను త్వరలోనే మీ ముందుకు తెస్తాము అంటూ తెలిపారు.

ఇకపోతే ఈ జోడి పెళ్లికి ముందు , పెళ్లి పీటలపై ఎంత సందడి చేసిందో ఈ టీజర్ చూస్తేనే మనకు తెలుస్తుంది .అంతేకాదు ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.అయితే  నిక్కీ, ఆది తమ పెట్ డాగ్స్ తో ఫోటోలో దిగడం, వధూవరులు లాగా తయారవడం, డాన్స్ చేయడం, హల్దీ ఫంక్షన్ తదితర మధుర ఘట్టాలన్నింటిని ఈ వీడియోలో చాలా షార్ట్ గా చూపించారు. ఇక పోతే హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్ తదితరులు వారికి తోడై వేడుకలలో మరింత జోష్ నింపారు. కాగా  ఈ పెళ్లికి హాజరైన మరికొంతమంది తారలు, రాజకీయ నేతల క్లిప్పింగ్స్ తదితర వీడియోలలో చూపించే అవకాశం ఉందని సమాచారం.

ఇకపోతే ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండవ కుమారుడు ఈ ఆది పినిశెట్టి . ప్రస్తుతం విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.అయితే  ఒక విచిత్రం అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఆది.. తెలుగు , తమిళ చిత్ర భాషల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ఇక ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు విలన్ గా పలు సినిమాలలో నటించడం జరిగింది. ఇకపోతే  వీరిద్దరూ కలిసి యాగవరాయనుం నా కాక్క , మరగద నాయనం చిత్రాలలో కలిసి నటించారు. అయితే మొదట గొడవ పడి ఆ తర్వాత ప్రేమించుకున్నట్లు చివరికి పెద్దల అంగీకారంతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు.పోతే వీరి పెళ్లికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: