జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఇటీవలికాలంలో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం జబర్దస్త్ నుంచి బయటికి వచ్చినప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కార్యక్రమాలలో మాత్రం కొనసాగుతున్నాడు. ఎప్పుడూ ఇతరుల పై పంచులు వర్షం కురిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులందరికీ కామెడీ పంచుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఏకంగా వ్యక్తిగత విషయాలపై కూడా పంచులు వేస్తూ ఉంటాడు హైపర్ ఆది. బాడీ షేమింగ్ చేసే విధంగా హైపర్ ఆది పంచులు ఉంటాయని కొంతమంది విమర్శకులు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి..


 ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణ విషయంలో కూడా ఇలాంటి ఒక దారుణమైన పంచ్ వేసి అందరి ముందే ఆమె పరువు తీసేసాడు హైపర్ ఆది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. కాగా ఈ ప్రోమో లో భాగం గా ఎప్పటిలాగానే హైపర్ ఆది సరదాగా ముచ్చటిస్తూ తన పంచులతో సందడి చేశారు.. అయితే ఇక హీరో ఆది సాయి కుమార్ తో హైపర్ ఆది మాట్లాడుతూ ఉండగా మధ్యలో పూర్ణ జోక్యం చేసుకుంది. హైపర్ ఆది అందరిని ఫ్లర్ట్ చేస్తారు అంటూ చెబుతుంది.


 అయితే పూర్ణ అలా కామెంట్ చేయగానే పంచులు వర్షం కురిపించే హైపర్ ఆది సైలెంట్ గా ఉండడు కదా. ఈ క్రమంలోనే ఒక పంచ్ వేసి పూర్ణ  పరువు తీసేసాడు. అక్కడ జరుగుతున్న సంభాషణకు సంబంధం లేకుండా పూర్ణ మీ హనీమూన్ ఎలా జరిగింది అంటూ అడుగుతాడు హైపర్ ఆది. దీంతో ఒక్కసారిగా పూర్ణ సిగ్గుతో తలదించుకుంది. ఈ క్రమంలోనే  హైపర్ ఆది వేసిన పంచుతో ఎంతోమంది అవాక్కవుతున్నారు అని చెప్పాలి.  అయితే ఇటీవల కాలంలో పూర్ణ పెళ్లి జరిగింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాగా ఇక ఈ ప్రచారం నేపథ్యంలోనే హైపర్ ఆది ఇలాంటి పంచ్ వేసి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: