టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అఖిల్ ఇప్పటికే అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  మూవీ లలో హీరో గా నటించాడు . ఈ మూవీ లలో తాజాగా విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని ఫామ్ లోకి వచ్చిన అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా , మమ్ముట్టిమూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు .

మూవీ కి హిప్ హప్ తమిజ  సంగీతాన్ని అందిస్తున్నాడు . ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం టీజర్ ని విడుదల చేయగా , ఈ మూవీ టీజర్ అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ టీజర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది . ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు డినో మోరియామూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: