మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంయుక్త మీనన్ , దగ్గుపాటి రానా , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంయుక్త మీనన్మూవీ లో దగ్గుబాటి రానా కి జోడిగా నటించింది. ఈ మూవీ లో సంయుక్త మీనన్ పాత్ర నిడివి పరంగా చూసుకుంటే కాస్త తక్కువ సమయమే కనిపించినప్పటికీ ఈ మూవీ లో సంయుక్త మీనన్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండడంతో ఈ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంయుక్త మీనన్ కి మంచి గుర్తింపు లభించింది.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ  కూడా విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇప్పటికే బాక్సా ఫీస్ దగ్గర ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకని టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ని ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సంయుక్త మీనన్ , కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: