నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు అయితే ఉన్నాయి. అతనొక్కడే, పటాస్, బింబిసార సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.


బింబిసార సినిమా ఇప్పటికే 25 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా ఈ సినిమా పెట్టుబడికి సమాన స్థాయిలో లాభాలను అందించడం గ్యారంటీ అని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు.


అయితే బింబిసార సక్సెస్ ను కళ్యాణ్ రామ్ క్యాష్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ ఖాతాలో ఖాతాలో విజయాలు ఉన్నా వరుసగా కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించలేదు. కళ్యాణ్ రామ్ హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారట.. ఫ్యాన్స్ కోరికను కళ్యాణ్ రామ్ నెరవేరుస్తారో లేదో చూడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు డెవిల్, బింబిసార2 సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయట..


 


డెవిల్ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండ గా బింబిసార సీక్వెల్ బింబిసార2 సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాల తో కళ్యాణ్ రామ్ కు స్టార్ ఇమేజ్ దక్కడం ఖాయమని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ కూడా తను నటించిన ప్రతి ప్రాజెక్ట్ అంచనాల కు మించి సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


 


వివాదాలకు దూరంగా ఉండే హీరోగా పేరును సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలలో నటిస్తుండటం విశేషం. సొంత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలతోనే కళ్యాణ్ రామ్ కు విజయాలు దక్కాయనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: