తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్  రియాలిటీ షోగా ప్రారంభమైంది బిగ్బాస్ కార్యక్రమం. ఇక అప్పటి వరకు బుల్లితెరపై ఎన్ని కార్యక్రమాలు ప్రసారం అవుతున్నప్పటికీ బిగ్బాస్ వచ్చిందంటే చాలు ఆ రేటింగ్ ముందు మిగతా షోలు అన్నీ కూడా సైడ్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. ఇప్పటికే తెలుగు బుల్లితెరపై ఎంతో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. మొన్నటికి మొన్న బిగ్ బాస్ ఓటిటి సీజన్ ద్వారా నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఆరో సీజన్లో కి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది బిగ్ బాస్ కార్యక్రమం.


 అయితే గత మూడు సీజన్స్ నుంచి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఇక ఇప్పుడు ఆరో సీజన్ కు కూడా వ్యాఖ్యాతగా మారిపోయి మరోసారి సందడి చేయబోతున్నారు. అయితే బిగ్బాస్ సీజన్ గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచి ఈసారి హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో పేర్లు తెర మీదికి వచ్చి తెగ చక్కెర్లు కొడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ పేరు కూడా వైరల్ గా మారిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఇప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కాదు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా క్రేజ్ సంపాదించుకున్న అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లపోతుంది. ఆమె ఎవరో కాదు సుదీప. ఈ అమ్మడు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంది. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా వెంకటేష్ మరదలిగా కూడా నటించింది. తర్వాత ఎన్నో సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నించింది. కానీ తాను నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందక పోవడంతో చివరికి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఇండస్ట్రీ  లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ లోకి రావాలని భావిస్తోందట. నిర్వాహకులను సంప్రదించగా  ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా రావడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: