విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తనికెళ్ల భరణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వైవిద్య భరిత పాత్రలలో నటించగలిగిన ఏకైక వ్యక్తి తనికెళ్ల భరణి అని చెప్పవచ్చు. శివ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన సినిమాలలోకి రాకముందు నాటకాలకు రచయితగా పనిచేసేవారు. ప్రస్తుతం ఈయన రచయితగా కంటే నటుడు గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మాతృదేవోభవ సినిమా ద్వారా ఈయన నటనకు మరింత గుర్తింపు లభించిందని చెప్పాలి. ఒకానొక సమయంలో మాతృదేవోభవ సినిమా తర్వాత బయటకు వెళితే ఎంతోమంది మహిళలు ఈయనను కొట్టే ప్రయత్నం చేశారట. ఎందుకంటే మాతృదేవోభవ సినిమాలో విలన్ పాత్రలో ఆమెను చాలా హింసించే క్రూరమైన పాత్రలో నటించారు.
ఇక మహిళలు ఈయనను నిజజీవితంలో కూడా అలాగే భావించి కొట్టడానికి వచ్చారు అంటే ఇక ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలా సుమారుగా 300కు పైగా సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది దర్శక నిర్మాతలకు ఇష్టమైన నటుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు.సుమారు మూడు దశాబ్దాలకు పైగా సినిమాలలో నటించిన ఈయన తన కుటుంబ సభ్యులు మాత్రం ఏ రోజు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయలేదని చెప్పాలి . ఈయన పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు.
తండ్రి పేరు టీవీఎస్ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి లక్ష్మీనరసమ్మ . ఇక ఈయన భార్య పేరు దుర్గాభవాని. తనికెళ్ల భరణికి ఒక కొడుకు,  ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు మహా తేజ , కుమార్తె పేరు సౌందర్యలహరి. ఇక ఆయన తన ఇంటి పేరుకు..తన కూతురి పేరును పెట్టుకోవడం జరిగింది. ఇకపోతే వీరి కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక వాటినీ మనం ఒకసారి చూసేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: