టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం గా తెరకెక్కుతున్న సినిమా 'హరి హర వీర మల్లు'..ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై AM రత్నం మొత్తం 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాడు..ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ గత కొంత కాలం నుండి కూడా ఆగిపోయింది..పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీ అవ్వడం ఇంకా దానికి తోడు ఆయనకీ ఇటీవల ఆరోగ్య సమస్యలు తలెత్తడం తో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు..ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ సంపూర్ణంగా కోలుకున్నారు..ఇప్పుడు ఆయన సినిమాల షెడ్యూల్స్ ఇంకా రాజకీయ షెడ్యూల్స్ కూడా ప్లానింగ్ అయిపోయింది..రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక ప్రకటన కూడా అధికారికంగా చేయబోతున్నారట మూవీ యూనిట్..ప్రస్తుతం ఇప్పుడు ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తుంది.


వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని బాషలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసారు..కానీ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం..కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ మీద ప్రధానంగా ఆధారపడిన సినిమా కావడం తో ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చే అవకాశం అనేది కనిపించడం లేదు..ఇది అభిమానులకు ఒకింత నిరాశకి గురి చేసే విషయమే అయినప్పటికీ అక్టోబర్ 5 వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంబించబోతుండడంతో, అప్పటిలోగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేసేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట.


ఇంకా ఈ సినిమా తో పాటు ఆయన తమిళం లో సూపర్ హిట్టైన 'వినోదయ్యా సీతం' రీమేక్ లో కూడా పవన్ నటించాల్సి ఉంది..ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు..సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు ఇంకా స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ కూడా ఈ నెల 23 వ తారీకు నుండి ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: