మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికి కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో ఇంద్ర మూవీ కూడా ఒకటి.

2002 వ సంవత్సరంలో విడుదలయిన ఈ మూవీ అప్పట్లో బాక్సా ఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా , కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ కి బి.గోపాల్ దర్శకత్వం వహించగా ,  సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ కి మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించింది.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ మూవీ ని నిర్మించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా  ఇంద్ర మూవీ 4 కే వెర్షన్ విడుదల గురించి ఈ మూవీ నిర్మాణ సంస్థ అయి నటువంటి వైజయంతి మూవీస్ అధికారికంగా ఒక ప్రకటన చేసింది.  ప్రియమైన ప్రియమైన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు.. మీరే కాదు మేము కూడా ఇంద్ర 4 కే వెర్షన్  రిలీజ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము. కాకపోతే అది ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు ఉంటుంది. అయితే ఆ విడుదల మాత్రం మామూలుగా ఉండదు చాలా గ్రాండ్ గా ఉంటుంది అంటూ తాజాగా వైజయంతి మూవీస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: