టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించగా , మైక్ టైసన్మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ మూవీ ని  ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తో పాటు తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఈవెంట్ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా లైగర్ మూవీ యూనిట్ తాజాగా శనివారం చెన్నై లో సందడి చేసింది. ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో లైగర్ మూవీ లో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... లైగర్ మూవీ షూటింగ్ సందర్భంగా మైక్ టైసన్ చెంపపై కొట్టిన దెబ్బకు ఒక రోజు మొత్తం నొప్పితో బాధపడినట్టు తాజాగా విజయ్ దేవరకొండ చెప్పాడు.  మైక్ టైసన్ తో నటించడానికి ముందు కొంత ఆందోళన చెందినట్టు తాజాగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: