మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా పాన్ ఇండియా లో అద్భుతమైన క్రేజ్ ను కూడా సంపాదించు కున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటించాడు.

ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో భారీ క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో  కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా  , సునీల్ , అంజలిమూవీ లో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ , రామ్ చరణ్ మూవీ కంటే ముందు ఇండియన్ 2 మూవీ ని మొదలు పెట్టి కొన్ని  అనివార్య కారణాల వల్ల ఆ మూవీ షూటింగ్ ని నిలిపివేసిన విషయం మనకు తెలిసిందే.

మరి కొన్ని రోజుల్లో శంకర్ 'ఇండియన్ 2' మూవీ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దానితో శంకర్ , రామ్ చరణ్ మూవీ షూటింగ్ ని కొన్ని రోజుల పాటు నిలిపి వేయణునట్లు వార్తలు వస్తున్నాయి. దానితో రామ్ చరణ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించబోతున్నట్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: