యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కే జి ఎఫ్ మూవీ తో ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే గుర్తింపు ను తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా , శృతి హాసన్మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది.  తాజాగా సలార్ మూవీ యూనిట్ ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. సలార్ మూవీ ని 28 సెప్టెంబర్ 2023 వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. 

మూవీ యూనిట్ విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకొని అదిరిపోయే ఊర మాస్ లుక్ లో నిల్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ ను మూవీ యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతి తక్కువ సమయం లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల పోస్టర్ ను గమనిస్తే అర్థమవుతుంది. ఇప్పటికే కే జి ఎఫ్ మూవీ లో యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ 'సలార్' మూవీ లో ఇంకా ఏ రేంజ్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: