నందమూరి నటవారసుడు, హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అయితే తాజాగా కళ్యాణ్ రామ్  బింబిసార మూవీతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.ఇకపోతే  పటాస్ హిట్ అనంతరం చాలా కాలం తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది.అయితే ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ళ పరంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఇక  ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ అని అంటున్నారు.పోతే దీంతో బింబిసార సినిమా మూవీ యూనిట్ మొత్తం సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటోంది.

అయితే  ఈ క్రమంలోనే మూవీ యూనిట్‌తో పాటు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవితో స్పెషల్ చిట్ చాట్‌లో పాల్గొన్నాడు కళ్యాణ్ రామ్.కాగా  ఈమూవీలో బేబీ శ్రీదేవి శాంభవి అనే పాత్రలో అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ పాప చుట్టే బింబిసార మూవీ మొత్తం తిరుగుతుంది.ఇదిలావుంటే  తాజాగా శ్రీదేవితో కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..తన కెరియర్ కూడా ఇలాగే బాల నటుడిగా ప్రారంభమైందని గుర్తుచేసుకున్నాడు.అంతేకాదు శ్రీదేవి తన స్టడీస్ గురించి చెప్తుండగా..కళ్యాణ్ రామ్ కూడా తన స్కూల్ డేస్ గురించి చెప్పుకొచ్చాడు.

ఇక తన బాబాయ్ బాలకృష్ణ తనను బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడని ఆయన వల్లే సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పాడు. అయితే ఆ రోజుల్లో నేను సినిమాల్లో నటించేటప్పుడు కోక్ కావాలి, చాక్లెట్ ఇస్తానే షూటింగ్‌కు వస్తానని బెదిరించే వాడిని.కాగా షూటింగ్ అనంతరం ఇంటికి వెళ్లిపోయేవాడిని.అయితే ..అంతేగాని ఒక్క బుక్కు కూడా చదివే వాడిని కాదు.ఇక  దాంతో నా స్టడీస్ మొత్తం పోయాయి. మాకు అప్పట్లో 45 వస్తే పాస్. ఇకపోతే నాకు 46, 47మార్కులు వచ్చేవి.ఇక అలా బాబాయ్ తనను సినిమాల్లోకి తీసుకుని రావడంతో నా చదువు మొత్తం పోయిందంటూ కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: