కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటుల్లో ఒకరు అయిన విజయ్ సేతుపతి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . విజయ్ సేతుపతి హీరోగా నటించడం మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో మరియు మరి కొన్ని ఇతర ముఖ్యమైన పాత్ర ల్లో కూడా నటిస్తూ తన కెరీర్ ని అద్భుతమైన రీతి లో ముందుకు తీసుకు వెళ్తున్నడు . అందులో భాగంగా విజయ్ సేతుపతి ఇప్పటికే తెలుగు లో కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి,  పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాడు .

ఇలా హీరోగా, విలన్ గా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో దేనిలోనైనా తనదైన నటన తో ప్రేక్షకులను అలరించే సత్తా ఉన్న విజయ్ సేతుపతి తో  లాల్ సింగ్ చడ్డా మూవీ లో ఒక పాత్రను వేయించాలి అని మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ అనుకున్నాడట , అమీర్ ఖాన్ నుంచి కబురు అందుకున్న విజయ్ సేతుపతి, అమీర్ ఖాన్ ను కూడా వెళ్లి కలిశాడట, అమీర్ ఖాన్ పై ఉన్న అభిమానంతో విజయ్ సేతుపతి 'లాల్ సింగ్ చడ్డా' మూవీ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట, చివరగా షూటింగ్ సమయానికి వచ్చే సరికి విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ పాత్రలో నాగ చైతన్య ను తీసుకున్నారట. ఇది ఇలా ఉంటే తాజాగా లాల్ సింగ్ చడ్డా మూవీ విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల నుండి నెగిటివ్ టాక్ లభించింది. దీనితో విజయ్ సేతుపతి ఒక భారీ ఫ్లాప్ మూవీ నుండి తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: