హీరోయిన్ తమన్నా అంటే తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమే 2005లో మంచి మనోజ్ హీరోగా శ్రీ సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత తన టాలెంట్ తో అది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరుపొందింది దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 17 సంవత్సరాలు పైనే అవుతుంది. ఇక ఈమె కెరియర్ లో ఎన్నో హిట్ , ప్లాపులతో సంబంధం లేకుండా తన కెరీర్ ని ముందుకు తీసుకు వెళుతుంది రీసెంట్గా తన నటించిన ఎఫ్-3 సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వెంకటేష్ ,వరుణ్ తేజ్ హీరోలుగా ఈ సినిమాలో నటించారు.

ఇక ఈ సినిమాకి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ చిత్రం విజయంతో తమన్న తన తదుపరిచిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో బోళా శంకర్ , సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం వంటి సినిమాలలో నటిస్తున్నది వీటిలో గుర్తుందా శీతాకాలం ఇప్పటికే షూటింగును కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం అలాగే మరొకవైపు బాలీవుడ్ లో కూడా ఈమె నటించిన బాబ్లీ బౌన్సర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం లేడీ బౌన్సర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


బాలీవుడ్ డైరెక్టర్ మధుర్ బండార్కార్  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు విచిత్రాన్ని డైరెక్ట్గా ఓటీటి లోనే విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ఒకేసారి అన్ని భాషలలో డిస్నీ హాట్ స్టార్ లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలు పాల్గొన్నా తమన్నా.. మాట్లాడుతూ బాబ్లీ బౌన్సర్ సినిమాలో తనది ఒక బలమైన శ్రీపాత్ర ఉంటుందని తెలిపింది. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్మకాన్ని కూడా తెలియజేసింది తన కెరీర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా గా నిలుస్తుంది అని తమన్నా తెలిపింది. బాహుబలి సినిమాతో తన కెరియర్ మళ్లీ ఊపందుకుంది ఆ తర్వాత మళ్లీ ఈ సినిమానే తన సత్తా చూపించబోతోంది అన్నట్లుగా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: