యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితమే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపు ను కూడా తగ్గించు కున్నాడు . ఈ మూవీ లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు . ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో హీరోగా నటించబో తున్నాడు . ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది . ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించ నుండగా , రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేయబోతున్నాడు .

ఇప్పటి వరకు ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించ బోయేది ఎవరు అనేది చిత్ర బృందం అధికారికంగా ప్రకటించ లేదు . ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో నటించబోతున్నాడు . ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 31 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ 32 వ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలియజేశాడు. ఎన్టీఆర్ 31 సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మే 2023 వ సంవత్సరంలో ప్రారంభం కాబోతుంది అని తెలియజేశాడు. ఇలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 వ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ను తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: