మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆరు పదుల వయసులో కూడా వరుస ప్రాజెక్టులలో బిజీగా ఉంటూ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు చిరంజీవి.  ఇకపోతే నిన్న ఆగస్టు 15వ తేదీన ఆయన తన రోజును చాలా బిజీ బిజీగా గడిపారు హైదరాబాదు లో ఉన్న చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు.. మెగాస్టార్ చిరంజీవి,  ఆయన మాతృమూర్తి అంజనాదేవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ , చిరంజీవి సోదరి డాక్టర్ మాధవి తదితరులు హాజరయ్యారు. అంతేకాదు మెగాస్టార్ తల్లి అంజనాదేవి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక దీంతో అక్కడి వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా.. ఆహ్లాదకరంగా మారిందని చెప్పవచ్చు.
ఇక అంతకుముందు ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి.. జెండా వందనం అనంతరం ప్రసంగించారు. ఇక 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని.. ఈ ఉత్సవాలు జరుపుకోవడం మనందరి అదృష్టం అని భావిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. ఇక వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. అక్కడ ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న తన అభిమానిని  స్వయంగా కలిశారు. అతనితో మాట్లాడి ఉత్సాహం కలిగించారు . ఇక చిరంజీవిని చూసేసరికి అతడి ఆనందం రెట్టింపు అయిందని చెప్పాలి.

ఇక అభిమాని చక్రీధర్ ఆరోగ్య పరిస్థితిని చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడారు.. చక్రిధర్ పెడన చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఇక చిరంజీవికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట పల్చల్ చేస్తూ ఉంది.. అంతేకాదు మెగాస్టార్ మంచి మనసుపై అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా తన బిజీ లైఫ్ లో కూడా అభిమానులకు సమయాన్ని కేటాయిస్తూ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం గొప్ప విషయం అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: