టాలీవుడ్ సీనియర్ నటులలో బ్రహ్మాజీ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి మేప్పించారు ఇప్పటికీ కూడా ఈయన వరుస సినిమాలు చేస్తే చాలా బిజీగా ఉన్నారు. కెరియర్ ప్రారంభం నుంచి కంటే ఈ మధ్యకాలంలో మరింత బిజీగా మారిపోయారు బ్రహ్మాజీ. తాజాగా ఒక ఇంటర్వ్యూలు బ్రహ్మాజీ మాట్లాడడం జరిగింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు వాటి గురించి చూద్దాం.


బ్రహ్మాజీ మాట్లాడుతూ తను ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ 30 సంవత్సరాలు పైనే అవుతోంది. నటుడుగా చెన్నైలో ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే బెంగాలీ అమ్మాయితో పరిచయం ఏర్పడింది అలా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నానని తెలిపారు వివాహమైన తర్వాత బ్రహ్మజీ పిల్లలు వద్దనుకున్నాడట అందుకు కారణం ఆమెకు గతంలోనే ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని తన కొడుకుగా స్వీకరించి తన సొంత కొడుకు గాని చూసుకుంటూ ఉన్నారు బ్రహ్మాజీ. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆయన అభిమానులు సైతం బ్రహ్మాజీ చాలా గ్రేట్ అని అంటూ ఉన్నారు ఈ విషయాన్ని బ్రహ్మాజీ గతంలో ఎప్పుడూ కూడా చెప్పలేదు ఇన్నాళ్లకు ఈ విషయం చెప్పడంతో పలు చర్చనీయాంశం గా మారుతోంది.


ఇక ఈ మధ్యనే పిట్ట కథ అనే సినిమాతో తన కొడుకు సంజయ్ని బ్రహ్మాజీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది నటుడుగా అతనికి మంచి మార్కులే పడ్డాయి కానీ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను మాత్రం ప్రకటించలేదు. బ్రహ్మాజీ మాత్రం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఎక్కువగా ఈయన కామెడీ పాత్రలు మాత్రమే కాకుండా విలన్ పాత్రను కూడా చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న డీజే టిల్లు సినిమాల పోలీస్ ఆఫీసర్గా తన పాత్రతో మరింత ప్రేక్షకులను సంపాదించారు కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలోని నటిస్తూ ఉంటాడు బ్రహ్మాజీ. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: