బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లో  ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఒక్కసారిగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన పంచుల సునామీ తో బుల్లితెర కమెడియన్స్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇక హైపర్ ఆది వేసిన పంచులు వరుసగా ప్రేక్షకులందరినీ కూడా కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఒక పంచుకు పగలబడి నవ్వే లోపే మరో పంచ్ వస్తూ ఉంటుంది. దీంతో నాన్స్టాప్ ఎంటర్టైన్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు. అయితే తన ముందున్నది ఎవరు అన్నది పట్టించుకోకుండా హైపర్ ఆది పంచులతో రెచ్చి పోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా మెగా డాటర్ నిహారిక పైన కూడా పంచుల వర్షం కురిపించాడు..


 మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఉన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం నిహారిక ఒక్కరే అని చెప్పాలి. ఇక ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ  బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. చివరికి నిహారిక పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా మారిపోయింది. ఇప్పుడు నిర్మాతగా వ్యవహరిస్తు షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. అయితే ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ షో ద్వారా ఎంతో మందికి యాంకర్గా పరిచయమైంది నిహారిక. ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఒక స్పెషల్ గెస్ట్ గా పాల్గొంది నిహారిక. మెగా స్టార్ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నారు. అయితే నిహారిక రావడం రావడమే మా పెదనాన్న కు సరిపోయే రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉన్నాయో లేవో చూడడానికి వచ్చాను అంటూ  చెబుతుంది. ఇక ఆ తర్వాత హైపర్ఆది స్కిట్ లో చేస్తుంది నిహారిక. ఈ స్కిట్ లో భాగంగా నేను హీరోగా చేస్తున్నానని హైపర్ ఆది అంటాడు.. నేను పాన్ ఇండియా లో నటిస్తున్న అని నిహారిక అంటుంది. జోక్ బాగుంది అంటూ హైపర్ ఆది అంటాడు. ముందు ఎవరు వేశారు అంటూ హైపర్ ఆది కి కౌంటర్ ఇస్తుంది నిహారిక. నేను భీమ్లా నాయక్ సినిమాలో ఒక సాంగ్ చేశాను అంటూ చెబుతాడు హైపర్ ఆది. దీంతో స్పందించిన నిహారిక అలా వచ్చి ఇలా వెళ్లిపోతే దాన్ని గొప్పగా చెప్పుకుంటారా అంటూ సెటైర్ వేస్తుంది. దీంతో ఆది కౌంటర్ వేస్తూ.. నువ్వు సైరా నరసింహారెడ్డి సినిమాలో చేసిన దానికంటే నేను చేసింది ఎక్కువే అంటూ అందరి ముందు పరువు తీసేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: