సూపర్ స్టార్ మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో హీరోగా నటించబో తున్నాడు . ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో 28 వ మూవీ గా తెరకెక్క బోతోంది . ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది . ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించ బోతున్నారు.

సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా సినీ కార్మికుల బంద్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. మరి కొన్ని రోజుల్లోనే గ్రాండ్ గా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో ఈ మూవీ పై మహేష్ బాబు అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే కే జి ఎఫ్ మరియు విక్రమ్ మూవీ లకు ఫైట్ మాస్టర్ గా పనిచేసిన అన్బరివు సోదరులు మహేష్ బాబు 28 వ మూవీ కి ఫైట్ మాస్టర్ గా పని చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని సూర్యదేవర నాగవంశం నిర్మించబోతున్నారు. ఈ మూవీ లో పూజా హెగ్డే తో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: