ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కెరీర్ లో ఎన్నో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీ లోకు దర్శకత్వం వహించి దర్శకుడిగా ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న మణిరత్నం గత కొంత కాలంగా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర మ్యాజిక్ ను చేయలేకపోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.  మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికి మూవీ యూనిట్ ఈ మూవీ ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ లో నటిస్తున్న కొంత మంది ప్రముఖ నటి నటుల ఫస్ట్ పోస్టర్ లను కూడా మూవీ యూనిట్ విడుదల చేయడం మాత్రమే కాకుండా , ఈ మూవీ టీజర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా పొన్నియన్ సెల్వన్ మూవీ తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఒక గొప్ప రికార్డ్ ను సొంతం చేసుకుంది. తమిళ సినిమా హిస్టరీ లోనే మొదటి సారి ఈ మూవీ ని ఐమాక్స్ వర్షన్ లో కూడా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో విక్రమ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుండగా , ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: