యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రామ్ పోతినేని ఇప్పటికే ఎన్నో విజయ వంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు . తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న రామ్ పోతినేని తాజాగా తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం లో తెరకెక్కిన ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో జూలై 14 వ తేదీన విడుదల అయ్యింది .

మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది . చివరగా ది వారియర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఇలా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన రామ్ పోతినేని మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయి నటు వంటి బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో నటించబోతున్నాడు . ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ , హిందీ ,  మలయాళ , కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే ది వారియర్ మూవీ తో తన అభిమానులను ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రామ్ పోతినేని , బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తో అద్భుత విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.  మరి రామ్ పోతినేని , బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: